
సూపర్ స్టార్ మహేష్ కూడా బిజినెస్ రంగంలోకి దిగాడు. స్టార్స్ ఎవరికి వారు తమ సొంత బిజినెస్ లు ప్రారంభిస్తుండగా లేటేస్ట్ గా మహేష్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. హైదరాబద్ కొండాపూర్ లో కొత్తగూడ బొటానికల్ గార్డెన్ దగ్గరలో మహేష్ ఏం.ఎం.బి మల్టీప్లెక్స్ ఓపెన్ చేశారు. ఏసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో కలిసి మహేష్ ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలుపెట్టారు.
ఆదివారం సూపర్ స్టార్ కృష్ణ రిబ్బన్ కట్ చేయడంతో ఈ మల్టీప్లెక్స్ మొదలుపెట్టారు. అధునాతన సౌకర్యాలతో 360 డిగ్రీ కోణంలో సినిమా ఎక్స్ పీరియన్స్ పొందేలా ఈ మల్టీప్లెక్స్ కట్టడం జరిగింది. 7 స్క్రీన్స్ ఉన్న ఈ మల్టీప్లెక్స్ లో 1638 సీటింగ్ సామర్ధ్యం ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో ఇప్పటివరకు ఉన్న మల్టీప్లెక్స్ లను తలదన్నేలా ఓ ఇంద్రభవనం లానే ఈ మల్టీప్లెక్స్ ఉందని అంటున్నారు.
నవంబర్ 29న 2.ఓ రిలీజ్ టైంలోనే ఈ మల్టీప్లెక్స్ రెడీ అవుతుందని అనుకోగా కొన్ని కారణాల వల్ల ఆదివారం మల్టీప్లెక్స్ మొదలుపెట్టారు. ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు సిని పరిశ్రమ పెద్దలు అటెండ్ అవడం జరిగింది.