
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీస్ లో ఒకటి అత్తారింటికి దారేది. త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ ముందే పైరసీ కాగా సినిమా మాత్రం కలక్షన్స్ బీభత్సం సృష్టించింది. పవర్ స్టార్ తో పాటుగా సమంత, ప్రణతి నటించిన ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను ఆల్రెడీ కన్నడలో సుదీప్ రీమేక్ చేయగా ఇప్పుడు తమిళంలో ఈ సినిమా రీమేక్ గా వంత రాజవతాన్ వరువన్ వస్తుంది.
శింభు హీరోగా నటిస్తున్న ఈ మూవీని సుందర్ సి డైరెక్ట్ చేస్తున్నారు. మేఘా ఆకాష్, కేథరిన్ త్రెసాలు నటిస్తున్న ఈ సినిమాలో బొమ్మన్ ఇరాని పాత్రలో నాజర్, నదియా పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది. ఇక రావు రమేష్ గా ప్రభు కనిపిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అవగా టీజర్ పవన్ సినిమాను మక్కీమక్కీ దించినట్టు అనిపిస్తున్నా పవర్ స్టార్ సినిమా రేంజ్ అందుకోవడం కష్టమే అనేలా ఉంది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019లో రిలీజ్ అని తెలుస్తుంది.