
బాహుబలితో నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ తో బాలీవుడ్ సినిమా చేయాలని అనుకున్నాడు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. బాహుబలి సినిమాను హిందిలో భారీ రేంజ్ లో రిలీజ్ చేసి ఆ సినిమాకు తగినంత ప్రమోషన్ ఏర్పాటుచేశాడు. అయితే ప్రభాస్ తో కరణ్ సినిమా ప్లాన్ చేసినా ప్రభాస్ మాత్రం సారీ అనేశాడు. ప్రస్తుతం సాహో ఆ తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో మూవీ ఉండటంతో సినిమా కుదరదన్నాడు.
అయితే ప్రభాస్ ప్లేస్ లో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో కరణ్ జోహార్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈమధ్య జాన్వి కూడా విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని చెప్పింది. విజయ్, జాన్విలతో కరణ్ జోహార్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. టాక్సీవాలా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ కూడా ఈ విషయాన్ని చెప్పాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా మరో సినిమా సెట్స్ మీద ఉంది. మరి విజయ్ బాలీవుడ్ అటెంప్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.