
భాగమతి తర్వాత అనుష్క సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న అనుష్క ఫ్యాన్స్ కు ఓ షాకింగ్ న్యూస్. స్వీటీ అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పనుందట. సైజ్ జీరో కోసం బరువు పెరిగిన అనుష్క ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా సరే లావు తగ్గలేకపోయింది. మొన్నీమధ్య సన్నబడినట్టు అనిపించినా మళ్లీ లావెక్కేసిందట. ఇక ఇలానే ఉంటే సినిమాలు చేయడం కష్టమని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేయాలని చూస్తుందట.
అంతేకాదు 36 ఏళ్ల వయసు వచ్చిన అనుష్కకు పెళ్లి చేసేయాలని ఇంట్లో వాళ్లు కూడా ఒత్తిడి తెస్తున్నారట. అందుకే అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని అంటున్నారు. ఇదిలాఉంటే కోనా వెంకట్ డైరక్షన్ లో మాధవన్, అనుష్క ఓ సినిమా చేస్తున్నారట. ఇదే కాకుండా ప్రభాస్ తో కూడా జిల్ ఫేం రాధాకృష్ణ చేసే సినిమాకు అనుష్కను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందట. ఓ పక్క సినిమాలను ఆపేసి పెళ్లంటూ వార్తలొస్తుంటే మరోపక్క మాత్రం స్వీటీకి ఆఫర్ల వెళ్లువ అంటూ న్యూస్ లు రాస్తున్నారు. మరి వీటిలో ఏది వాస్తవం అన్నది ఆమె స్వయంగా చెబితేనే తెలుస్తుంది.