ఆరెక్స్ పాప ఐటం సాంగ్

ఆరెక్స్ 100 సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించిన పాయల్ రాజ్ పుత్ తన తర్వాత సినిమాలు కూడా ఆరెక్స్ 100 లాంటి కథలే వస్తుండటంతో కస్సు బుస్సు మంది. ఫైనల్ గా అమ్మడు ఓ రెండు తెలుగు ప్రాజెక్టులు చేజిక్కించుకుంది. ఇక అవి కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో ఐటం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన శ్రీనివాస్ సినిమాల బడ్జెట్ తో పాటుగా హీరోయిన్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవడు.

అందుకే మొదటి సినిమా అల్లుడు శీను నుండి ఈమధ్య వచ్చిన సాక్ష్యం వరకు సమంత, తమన్నా, రకుల్, పూజా హెగ్దె లాంటి భామలతో రొమాన్స్ చేశాడు. ఇక ప్రస్తుతం తేజ సినిమా కోసం కాజల్ తో జత కడుతున్న ఈ యువ హీరో ఆరెక్స్ 100 హీరోయిన్ పాయల్ అందాలను అదనంగా ఐటం సాంగ్ ద్వారా స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాడు. మొదటి సినిమాలో ముద్దులతో మనసులు గెలిచిన పాయల్ రాజ్ పుత్ బెల్లంకొండ బాబుతో ఐటం సాంగ్ లో ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.