ఆన్ లైన్ లో టాక్సీవాలా ఫుల్ మూవీ లీక్..!

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమా ఫుల్ మూవీ ఆన్ లైన్ లో లీకైనట్టు తెలుస్తుంది. రాహుల్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. విజయ్ సరసన ప్రియాంకా, మాళవిక నాయర్ నటిస్తున్నారు. కొన్నాళ్లుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మొత్తం ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. నిర్మాతలు వెంటనే ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈమధ్యనే రిలీజ్ అయిన విజయ్ గీతా గోవిందం సినిమా కూడా రిలీజ్ కు వారం రోజులు ఉంది అనగా సగానికి పైగా లీక్ అయ్యింది. ఆ సినిమా ఎలాగోలా గట్టెక్కింది అనుకుంటున్న టైంలో ఈసారి మళ్లీ విజయ్ దేవరకొండ టాక్సెవాలా సినిమా కూడా ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. సినిమా నిర్మాతలు మాత్రం ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. నిందితులు ఎవరైనా సరే వారిని శిక్షించడం ఖాయమని తెలుస్తుంది.