
నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 2 ఆరో వారం నామినేషన్ కూడా జరిగింది. తేజశ్వి, సామ్రాట్ లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని శనివారం సస్పెన్స్ లో పెట్టిన నాని ఫైనల్ గా తేజశ్విని బయటకు పంపించేశాడు. ఇక బయటకు వచ్చిన తేజశ్వి ఇంటి సభ్యుల గురించి తాను ఏమనుకుంటుందో చెప్పి 10 మార్కులకు కొదరికి 8, కొందరికి 10 మార్కులు ఇచ్చింది. కౌశల్ కు మాత్రం 5 మార్కులు ఇచ్చింది.
ఇక సామ్రాట్ తో బిగ్ బాస్ హౌజ్ లో లవ్ తనకి నచ్చిందని చెప్పిన తేజశ్వి అతనితో బయటకు వచ్చాక మాట్లాడుతా అని చెప్పింది. ఇక తనీష్ తో నువ్వు కోపంగా ఉంటేనే బాగుంటావని అన్నది. ఫైనల్ గా కౌశల్ కు చిన్న మెసేజ్ ఇచ్చింది. కౌశల్ మీరు బిగ్ బాస్ విన్నర్ అవ్వొచ్చు కాని నేను హౌజ్ లో అందరి మనసులను గెలిచానని అన్నది తేజశ్విని. మొత్తానికి అలా బిగ్ బాస్ నుండి తేజశ్వి కూడా బయటకు వచ్చేసింది.