స్టార్ తనయుడితో శేఖర్ కమ్ముల..!

ఆనంద్ సినిమా నుండి ఫిదా వరకు తను తీసే ప్రతి సినిమా ఎలాంటి జానర్ అయినా తన మార్క్ చూపిస్తూ వస్తున్నాడు శేఖర్ కమ్ముల. అనామికతో కాస్త వెనుకపడినట్టు అనిపించినా ఫిదాతో మళ్లీ తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ఓ స్టార్ హీరో తనయుడిని డైరెక్ట్ చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. కోలీవుడ్ స్టార్ హీరో విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా శేఖర్ కమ్ముల సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట. 

ధ్రువ్ ఇప్పటికే అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ లో నటిస్తున్నాడు. ఆ సినిమాను బాలా డైరెక్ట్ చేస్తున్నాడు. ధ్రువ్ సెకండ్ మూవీ కమ్ముల శేఖర్ డైరక్షన్ లోనే అని ఫిక్స్ చేశారట. తెలుగు, తమిళ బైలింగ్వల్ గా ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారట. తెలుగులో క్రేజీ డైరక్టర్ అయిన శేఖర్ కమ్ముల తమిళంలో కూడా అనామిక సినిమా చేసి తన టాలెంట్ చూపించాడు. మరి విక్రం తనయుడితో శేఖర్ కమ్ముల ఎలాంటి మూవీ చేస్తాడో చూడాలి.