
శ్రీవాస్ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమా సాక్ష్యం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో నామా అభిషేక్ నిర్మిస్తున్న ఈ సినిమాలో డిజే బ్యూటీ పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా టీజర్, ట్రైలర్ పంచభూతాల కాన్సెప్ట్ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ఇదో సోషియో ఫ్యాంటసీ కథ అని అందరు అనుకుంటుంటే లేటెస్ట్ గా ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ లైన్ చెక్కర్లు కొడుతుంది.
హీరో ఓ వీడియో గేమ్ డెవలపర్ అట.. అతను డెవలప్ చేసిన ఓ గేమ్ ద్వారా అతని లైఫ్ లో విలన్లు చనిపోతారట. అసలు ఆ గేమ్ కు.. విలన్లకు లింక్ ఎలా అన్నది దర్శకుడు శ్రీవాస్ అద్భుతంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడట. అయితే ఈ కథ వింటే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన రావన్ సినిమా గుర్తురాక మానదు. అందులో కూడా వీడియో గేమ్ ద్వారా వచ్చిన రోబో అందరిని చంపేస్తాడు. సో మొత్తానికి సాక్ష్యం సినిమా కథ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. మరి ఈ సినిమా కథ అదేనా కాదా అన్నది సినిమా వస్తేనే గాని తెలియదు.