
నాచురల్ స్టార్ నాని.. క్రేజీ బ్యూటీ అనుష్క శెట్టి.. ఇద్దరు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే అబ్బో ఇక ఆ కాంబినేషన్ ఆడియెన్స్ కు స్పెషల్ అన్నట్టే. అలాంటి క్రేజీ కాంబో సెట్ చేశాడు ప్రయోగాత్మక దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఐతే నుండి మనమంతా వరకు తీసే ప్రతి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలా చూసుకునే యేలేటి ఈసారి మరో ఎక్స్ పెరిమెంటల్ మూవీ చేయబోతున్నాడని తెలుస్తుంది.
అందులో నాని, అనుష్క లీడ్ రోల్స్ అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. నాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతుంటే మరో పక్క అనుష్క కూడా సక్సెస్ మేనియా కొనసాగిస్తుంది. ఈ ఇద్దరు కలిసి కచ్చితంగా ఆడియెన్స్ కు థ్రిల్ చేయడం ఖాయం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని డీటైల్స్ త్వరలో వెళ్లడించనున్నారు.