రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసే పనిలో ప్రభాస్..!

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే ఇక హీరోల ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ హిట్ పడ్డట్టే. అయితే అలా హిట్ పడటం కెరియర్ కు ఎంత ప్లస్ అయినా ఆ తర్వాత ఆ హీరోల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎన్.టి.ఆర్, నితిన్, ప్రభాస్ ఇలా అందరు జక్కన్న సినిమా తర్వాత కచ్చితంగా ఫ్లాప్ అందుకున్నారు. బాహుబలి మొదటి రెండు పార్టుల తర్వాత ప్రభాస్ ఆ సెంటిమెంట్ కు బ్రేక్ వేయాలని చూస్తున్నాడు.

సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవడం లేదట. ముఖ్యంగా రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసేందుకు సినిమా రీ టేక్, రీ షూట్స్ ఎన్నైనా పర్వాలేదు అంటున్నట్టు టాక్. మరి ప్రభాస్ అనుకున్నట్టుగా జక్కన్న సెంటిమెంట్ బ్రేక్ చేసేలా సాహో ఫలితాన్ని అందుకుంటాడా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం.