మహేష్ 25.. ఆ సీన్స్ హైలెట్ అట..!

భరత్ అనే నేను సక్సెస్ తర్వాత మహేష్ కెరియర్ లో 25వ సినిమా వంశీ పైడిపైల్లి డైరక్షన్ లో చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే డెహ్రాడూన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహేష్ మూవీలో కాలేజ్ సీన్స్ మాత్రం హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. మహేష్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఏప్రిల్ 5 ఉగాది కానుకగా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రాజసం టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు అఫిషియల్ టైటిల్ ఆగష్టు 9 మహేష్ బర్త్ డే నాడు ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ డైరక్షన్ లో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు.