బయోపిక్ కు భారీ డీల్..!

మహానటి సినిమా తర్వాత బయోపిక్ సినిమాలపై బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఎన్.టి.ఆర్, యాత్ర సినిమాల కోసం భారీ ఢీల్ సెట్ చేస్తున్నారట. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ బయోపిక్ కోసం ఓవర్సీస్ లో 12 కోట్ల ఆఫర్ కోట్ చేశారట. ఓవర్సీస్ లోనే ఈ రేంజ్ లో ఉంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎన్.టి.ఆర్ బయోపిక్ భారీ బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

క్రిష్ డైరక్షన్ లో ఈమధ్యనే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా అనుకున్న విధంగా పూర్తి చేసి 2019 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు. సినిమాలో బాలయ్య 60 గెటప్పులలో కనిపిస్తాడని తెలుస్తుంది. రానాతో పాటుగా ప్రముఖులు కొందరు ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని తెలుస్తుంది.