
సుధీర్ బాబు హీరోగా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమ్మోహనం మంచి సక్సెస్ అయ్యింది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ఆ సినిమా సుధీర్ బాబుకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. సమ్మోహనం వచ్చిందో లేదో వెంటనే మరో సినిమాతో వస్తున్నాడు సుధీర్ బాబు. ఈసారి తానే నిర్మాతగా మారి చేస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుధీర్ బాబు.
ఆర్.ఎస్ నాయుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు నన్ను దోచుకుందువటే అంటూ టైటిల్ పెట్టారు. సినిమాలో సీరియస్ రోల్ లో సుధీర్ బాబు నటన అలరిస్తుందని తెలుస్తుంది. కొత్త హీరోయిన్ నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. హీరో సీరియస్ గా కనిపిస్తుండగా హీరోయిన్ చాలా చలాకీగా అనిపిస్తుంది. ఈరోజు ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ ఇంప్రెసివ్ గా ఉండగా సుధీర్ బాబు మొదట నిర్మిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.