హాలీవుడ్ మూవీ స్పూర్తితో సమంత మూవీ..!

పెళ్లి తర్వాత సమంత సినిమాల స్పీడ్ పెంచింది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు ఇలా వరుస హిట్లు అందుకున్న సమంత ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ మూవీ యూ టర్న్ రీమేక్ లో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత సమంత మరో లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ సినిమా కథ ఓ హాలీవుడ్ సినిమాకు స్పూర్తిగా తీయనున్నారట. 

కొలేటరల్ అనే హాలీవుడ్ సినిమా కథ స్పూర్తితో గిరీశయ్య అనే నూతన దర్శకుడు కథ సిద్ధం చేశాడట. సమంతను కలవడం కథ డిస్కస్ చేయడం జరిగిందట. సమంత కూడా ఈ సినిమా చేసేందుకు ఎక్సైటింగ్ గా ఉందని తెలుస్తుంది. సినిమలో ఆమె ట్యాక్సీవాలాగా కనిపించనుందట. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. మొత్తానికి పెళ్లి తర్వాత కొత్త టర్న్ తీసుకున్న సమంత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ జబర్దస్త్ ఫాం కొనసాగిస్తుంది. ఈమధ్యనే సినిమాలు ఆపేస్తుందని సమంత గురించి రకరకాల వార్తలు రాగా ఈ కొత్త అప్డేట్ తో ఆమె ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.