ఎన్టీఆర్ చేతుల్లో మొబైల్ బ్రాండ్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలను చేస్తున్నాడు. స్టార్ హీరోల క్రేజ్ వాడుకునేలా తన ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం కార్పోరేట్ కంపెనీలకు అలవాటే. ఇప్పటికే మహేష్ వాణిజ్య ప్రకటనలతో అలరిస్తుండగా ఎన్.టి.ఆర్ కూడా రెండు మూడు యాడ్స్ తో అలరిస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా మరో మొబైల్ సంస్థ ఎన్.టి.ఆర్ తో డీల్ సెట్ చేసుకుందని తెలుస్తుంది. 

సెలెక్ట్ మొబైల్ స్టోర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్.టి.ఆర్ చేయనున్నారట. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ కు ఎన్.టి.ఆర్ బ్రాండింగ్ చేయనున్నాడు. ఈమధ్యనే కియారా అద్వాని రెండు స్టోరెస్ ఓపెన్ చేయడం జరిగింది. ఎన్.టి.ఆర్ చేతుల్లో కొత్త మొబైల్ బ్రాండ్ క్రేజీగా మారింది. ఈ యాడ్ కోసం ఎన్.టి.ఆర్ బాగానే ఛార్జ్ చేస్తున్నాడట.