శ్యామలకు అన్యాయం చేసిన బిగ్ బాస్..!

నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్-2 నాల్గవ వారం యాంకర్ శ్యామల బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యింది. దీప్తి, శ్యామలా, నందినిలలో ఇద్దరిని కాపాడే పవర్ హౌజ్ మెట్స్ కౌశల్, తేజశ్వినికి ఇవ్వగా కౌశల్ నందినికి, తేజశ్విని దీప్తికి లైఫ్ ఇచ్చారు. దానితో శ్యామల్ ఇంటి నుండి బయటకు వచ్చారు. 11 నెలల బాబుని ఇంట్లో పెట్టుకుని బిగ్ బాస్-2కి వచ్చారు శ్యామల.

నాలుగు వారాల పాటు కంటెస్టంట్స్ అందరితో సరదాగా ఉంటూ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసిన శ్యామలా ఫైనల్ గా హౌజ్ నుండి క్విట్ అయ్యింది. అయితే అదేదో ఆడియెన్స్ పోల్ అని చెప్పకుండా ముగ్గురిని పిలిచి ఓటింగ్ సిస్టెంతో ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ శ్యామలకు అన్యాయం చేశాడని ఆడియెన్స్ ట్రోల్ చేస్తున్నారు. నాని హోస్టింగ్ మీద కూడా చాలా కామెంట్స్ వినపడుతున్నాయ్. కంటెస్టంట్స్ ను ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాడని.. తన ముందే హౌజ్ మెట్స్ గొడవపడటం లాంటివి నాని ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి.