
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇన్నాళ్లు మర్యాదగా మాట్లాడిన రేణు దేశాయ్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పవన్ మీద సంచలన కామెంట్స్ చేసింది. 11 ఏళ్లు కలిసి ఉన్న తనకు తెలియకుండానే మరో మహిళతో బిడ్డని కనేశాడు. పవన్ ను అభిమానించే వారు ఒకసారి తన స్థానంలో ఉంది ఆలోచిస్తే రేణు దేశాయ్. సెకండ్ మ్యారేజ్ విషయమై ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ కు ఘాటుగా స్పందించింది రేణు దేశాయ్.
పవన్ కు వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ చేయనని ఈమధ్యనే మెసేజ్ చేసిన రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో విడిపోడానికి గల కారణాలను రివీల్ చేసింది. పవన్ నుండి విడిపోయిన తర్వాత ఆమె అనుభవించిన బాధలను పంచుకుంది రేణు దేశాయ్. పాలిటిక్స్ లో పవన్ కు అన్నిటా ఆటంకాలే ఎదురవుతూ కత్తి మహేష్ లాంటి వారు ఏకు మేకే కూర్చుంటే కొత్తగా రేణు చేసిన కామెంట్స్ అలాంటి వారికి మరింత బలమైన అస్త్రంగా మారే అవకాశం కలిగింది. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.