'విజేత'కు క్లీన్ సర్టిఫికెట్..!

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరోగా చిరు చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రాకేష్ శషి డైరక్షన్ లో విజేత సినిమాతో కళ్యాణ్ దేవ్ తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ నెల 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ అందించడం జరిగింది.

వారాహి చలనచిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్లీన్ యు సర్టిఫికెట్ అంటే కచ్చితంగా విజేత ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మనసులు గెలుస్తుందని అంటున్నారు. మరి ఈ యువ మెగా హీరో కూడా మెగా అభిమానుల మనసు గెలిచి విజేత అవుతాడా లేడా అన్నది చూడాలి.