కార్తి 'చినబాబు' ట్రైలర్.. అదిరిపోయింది..!

తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ ఉన్న హీరోలలో సూర్య తర్వాత కార్తి కూడా లైన్ లో వస్తాడు. అందుకే తమిళంలో చేసిన తన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తాడు కార్తి. ఖాకితో అక్కడ ఇక్కడ హిట్ అందుకున్న కార్తి ఇప్పుడు చినబాబుగా రాబోతున్నాడు. పాండిరాజ్ డైరక్షన్ లో హీరో సూర్య నిర్మించిన ఈ సినిమాలో కార్తి సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా నటించింది.  

ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. తెలుగులో ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ లో మిర్యాల రవిందర్ రెడ్డి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఇంప్రెస్ చేసింది. ఊరి రాజకీయాల నేపథ్యంతో వస్తున్న ఈ చినబాబుపై కార్తి చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. తమిళంతో పాటుగా తెలుగులో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమా కార్తికి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి.