
మెగా మేనళ్లుడిగా వెండితెరకు పరిచయమైన సాయి ధరం తేజ్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించాడు. రేయ్ ముందు మొదలుపెట్టినా సరే పిల్లా నువ్వు లేని జీవితం ముందు రిలీజ్ అయ్యి తేజూకి మంచి మైలేజ్ ఇచ్చింది. ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం హిట్ తో మరో క్రేజీ మెగా హీరోగా మారాడు సాయి ధరం తేజ్. మెగా కాంపౌండ్ వేసిన రెడ్ కార్పెట్ మీద హాయిగా వెళ్తుందనుకున్న తేజూ కెరియర్ కాస్త డైలమాలో పడ్డది.
ఎంచుకున్న కథలు తప్పా.. లేక దర్శకుల ఎంపిక తప్పా అన్నది తెలియదు కాని ప్రస్తుతం వరుస ఫ్లాపులతో తేజూ కెరియర్ పెద్ద రిస్క్ లో పడ్డది. సుప్రీం తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. తిక్క నుండి నిన్న రిలీజ్ అయిన తేజ్ ఐలవ్యూ వరకు అన్ని ఫ్లాప్ సినిమాలే. కరుణాకరణ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకోగా ఇది కూడా నిరాశపరచింది. మరి ఇకనుండైనా సరే మెగా హీరో కథల విషయంలో కాస్త ఆచితూచి అడుగులేస్తే బెటర్ లేదంటే అతన్ని మెగా ఫ్యాన్స్ మర్చిపోవాల్సి వస్తుంది.