దేవదాస్ ఫస్ట్ లుక్.. ఇద్దరిలో ఎవరు లవ్ ఫెయిల్..!

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. యువ దర్శకుడు శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ అందరిని అలరిస్తుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ కూడా వెరైటీగా డిజైన్ చేశారు. సినిమాలో నాగార్జున డాన్ గా కనిపిస్తుండగా.. నాని డాక్టర్ గా నటిస్తున్నాడట.

ఆకాంక్ష సింగ్, రష్మిక మందన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా  ఈ ఇయర్ దసరా బరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మహానటి తర్వాత అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన దేవదాసు టైటిల్ తో వస్తున్న నాగ్, నానిల ఈ మోడ్రెన్ దేవదాసుల కథ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.