యాత్ర టీజర్ రిలీజ్ పోస్టర్ సెన్సేషన్..!

బయోపిక్ సినిమాలకు మంచి క్రేజ్ వచ్చిన ప్రస్తుతం పరిస్థితుల్లో మరో ప్రెస్టిజియస్ బయోపిక్ జనాల మెప్పు పొందేందుకు వస్తుంది. జననేతగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిన వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో యాత్ర మూవీ తెరకెక్కుతుంది. ఆయన రాజకీయ చరిత్రలో ప్రజాప్రస్థానంగా సాగిన పాదయాత్ర నేపథ్యంతో ఈ సినిమా వస్తుంది. అందుకే టైటిల్ కూడా యాత్ర అని పెట్టారు.


సినిమాలో వైఎస్సార్ గా మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండటం విశేషం. జూన్ లో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టిన ఈ సినిమాకు సంబందించిన టీజర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8 జీరో అవర్ లోనే రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబందించిన పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ యాత్ర మూవీని విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. సింగిల్ షెడ్యూ లోనే పూర్తి షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమ 2019 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు.