అరవింద సమేత టీజర్ డేట్ లాక్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కలిసి చేస్తున్న క్రేజీ మూవీ అరవింద సమేత వీర రాఘవ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్ రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10, 11 తేదిలలో రిలీజ్ చేయాలని పక్కా ప్లానింగ్ లో ఉన్నారు.

ఫస్ట్ లుక్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన తారక్ ఈ సినిమా టీజర్ ను ఆగష్టు 15న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ మరోసారి సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడని తెలిసిందే. ఇండిపెండెన్స్ డే కి నందమూరి ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకునే అవకాశం ఉంది. మరి టీజర్ తో త్రివిక్రమ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.