
రుద్రమదేవి సినిమా తర్వాత హిరణ్యకశ్యప సినిమా కథ సిద్ధం చేసుకున్న గుణశేఖర్ నిర్మాత కోసం ఇన్నాళ్లు ఎదురుచూశాడు. రుద్రమదేవి మంచి విజయం అందుకోవడంతో అతని మీద నమ్మకంతో సురేష్ బాబు హిరణ్యకశ్యప సినిమా నిర్మిస్తున్నాడట. రానా హీరోగా వస్తున్న ఈ పౌరాణిక సినిమా బడ్జెట్ దాదాపు 180 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది.
ఈ సినిమా కోసం ఇండియాలో టాప్ మోస్ట్ ఆర్టిస్టుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ హిరణ్యకశ్యప సినిమా కోసం వైకుంఠం, ఇంద్రలోకం సెట్లను వేస్తున్నారని తెలుస్తుంది. సురేష్ బాబు ఎంతో ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రానా నరసింహావతారం కూడా కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తున్నారట. బాహుబలి, సైరా తర్వాత ఆ రేంజ్ భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.