క్యాన్సర్ తో బాధపడుతున్న సోనాలి..!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న సోనాలి బింద్రే తనకు సోకిన క్యాన్సర్ వ్యాధి గురించి ప్రకటించింది. చిన్న అస్వస్థత అని హాస్పిటల్ కు వెళ్తే టెస్టులతో తనకు క్యాన్సర్ ఉందని వెళ్లడయ్యిందట. వెంటనే ట్రీట్ మెంట్ కూడా మొదలుపెట్టారట. ప్రస్తుతం న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ చేసుకుంటున్నట్టు చెప్పింది సోనాలి బింద్రే. ఈ టైంలో తన కుటుంబం, స్నేహితుల నుండి మంచి సపోర్ట్ వస్తుందని ట్వీట్ చేశారు సోనాలి బింద్రే.  

అందరి సహాయంతో క్యాన్సర్ పై పోరాడుతానని చెప్పింది సోనాలి బింద్రే. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ లతో నటించిన సోనాలికి క్యాన్సర్ వ్యాధి సోకడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉంది అన్న విషయం మాత్రం చెప్పలేదు. సోనాలి ట్వీట్ చేసిన నాటి నుండి ఆమె త్వరగా కోలుకుని మాములు మనిషి కావాలని ఆశిస్తూ ఫ్యాన్స్ రీ ట్వీట్స్ చేస్తున్నారు.