
ఎన్టీఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ చేస్తున్న ప్రెస్టిజియస్ మూవీ ఎన్.టి.ఆర్. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఎన్.బి.కే ప్రొడక్షన్స్ లో బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలుగా ప్రముఖులు నటిస్తుండగా నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్ కూడా నటిస్తాడని తెలుస్తుంది. సినిమాలో జూనియర్ ఎన్.టి.ఆర్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్రలో మోక్షజ్ఞ నటిస్తాడని అంటున్నారు.
ప్రస్తుతం మోక్షజ్ఞ ఈ సినిమా కోసమే స్లిమ్ గా కనిపించేందుకు రెడీ అవుతున్నాడట. మోక్షజ్ఞ తెర మీద కనిపించబోయే మొదటి సినిమా ఎన్.టి.ఆర్ బయోపిక్ కావడం విశేషం. అది కూడా జూనియర్ ఎన్.టి.ఆర్ పాత్రలో అంటే నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. అయితే తారక్ అంటే పడని బాలకృష్ణ అతని పాత్రలో తనయుడిని ఎలా పెడతాడంటూ డౌట్ పడుతున్నారు కొందరు. మరి అసలు వాస్తవం ఏంటన్నది తెలియాల్సి ఉంది.