
ఈమధ్యనే ఎన్.టి.ఆర్ ఫ్యామిలీలో కొత్త వారసుడు వచ్చాడు. ఎన్.టి.ఆర్, ప్రణతిలకు రెండో సంతానంగా బాబు పుట్టాడు. త్వరలో బారసాల వేడుక జరుపబోతున్నట్టు ప్రకటించిన ఎన్.టి.ఆర్ తన రెండో కొడుకు పేరు రివీల్ చేశాడు. ఎన్.టి.ఆర్ తన తనయుడి పేరు భార్గవ్ రామ్ అని పెట్టాడు. మొదటి కొడుకు పేరు అభయ్ రామ్ కాగా రెండవ కొడుకు పేరు భార్గవ్ రామ్ గా నిర్ణయించారు. ద లిటిల్ వన్ ఈజ్ భార్గావ్ రామ్ అని ట్వీట్ చేశాడు తారక్.
ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు ఎన్.టి.ఆర్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది.