హిస్టారికల్ మూవీలో సాయి ధరం తేజ్.. డైరక్టర్ ఎవరంటే..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఈ శుక్రవారం తేజ్ ఐలవ్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రెండు మూడు కథలు ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట సాయి ధరం తేజ్. అందులో ఒకటి హిస్టారికల్ మూవీ అని ఫిల్మ్ నగర్ టాక్. బిందాస్, రగడ సినిమాలు చేసిన వీరు పోట్ల చారిత్రిక కథ సిద్ధం చేశాడట. శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కథగా ఈ సినిమా వస్తుందట.  

కృష్ణదేవరాయల కాలం నాటి కథలతో ఇదవరకు చాలా సినిమాలు వచ్చాయి. మరి ఇది ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా విషయమై తేజూ ఎలాంటి నిర్ణయం చెప్పలేదట. సాయి ధరం తేజ్ ఓకే అంటే కనుక తన కెరియర్ లోనే ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని అంటున్నారు. హిస్టారికల్ మూవీ అంటే మళ్లీ కచ్చితంగా అందరి దృష్టి బాహుబలి లాంటి సినిమా మరోటి వస్తుందని భావిస్తారు. మరి తేజూ వీరు పోట్ల కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.