డీజే డైరక్టర్ కు బన్ని సర్ ప్రైజ్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా దువ్వాడ జగన్నాథం. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. లాస్ట్ ఇయర్ సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా తర్వాత బన్ని వక్కతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేశాడు. నా పేరు సూర్య మాత్రం అంచనాలను అందుకోలేదు.


డిజే పూర్తయినా సరే హరీష్ శంకర్ తో బన్ని టచ్ లోనే ఉన్నాడు. ఈమధ్యనే డిజే టీం మీటింగ్ జరుగగా.. ఇప్పుడు హరీష్ శంకర్ కు గిఫ్ట్ పంపించి సర్ ప్రైజ్ చేశాడు బన్ని. కెమెరా, పర్ఫ్యూమ్ బాటిల్ బన్ని హరీష్ శంకర్ కు పంపించినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో వెళ్లడించాడు హరీష్ శంకర్. థ్యాంక్యూ అల్లు అర్జున్ ఫర్ ది స్వీట్ సర్ ప్రైజ్.. యూ మేడ్ మైడ్ డే అంటూ ట్వీట్ కూడా చేశాడు. చూస్తుంటే ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందని చర్చలు మొదలుపెట్టారు.