
బాహుబలి సినిమాతో ప్రభాస్, రానా ఇద్దరు నేషనల్ వైడ్ గా స్టార్ క్రేజ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో షూట్ లో బిజీగా ఉండగా రానా తన సినిమాల వర్క్ అవుట్స్ లో ఉన్నాడు. బాహుబలి హీరో, విలన్ గా బాహుబలి, భళ్లాలదేవలను మళ్లీ ఒకే సినిమాలో చూడాలన్న కోరిక ప్రేక్షకుల్లో ఉంది. అలాంటి కథ వస్తే మళ్లీ కలిసి నటించేందుకు సిద్ధమే అని వారు కూడా అన్నారు.
ఇప్పుడు అలాంటి కథనే ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడు రచయిత, దర్శకుడు దశరథ్. ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తీసి హిట్ అందుకున్న దశరథ్ లాస్ట్ ఇయర్ శౌర్య సినిమాతో వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ప్రభాస్, రానాలు కలిసి చేసే ఓ క్రేజీ మల్టీస్టారర్ కథను రాస్తున్నాడట. తప్పకుండా ఇద్దరికి మెచ్చేలా ఈ కథ ఉంటుందని అంటున్నారు. మరి ప్రభాస్, రానా మళ్లీ హీరో విలన్ గా నటిస్తారా.. లేక ఇద్దరు స్నేహితులుగా కలిసి చేస్తారా అన్నది చూడాలి.