హరీష్ శంకర్ కు హ్యాండ్ ఇచ్చాడా..!

గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్ గత మూడు సినిమాలను దిల్ రాజు బ్యానర్ లోనే చేశాడు. బన్నితో చేసిన డిజే హిట్ అవగా తానే దర్శక నిర్మాతగా మారి ఓ మల్టీస్టారర్ మూవీ చేద్దామని అనుకున్నాడు హరీష్ శంకర్. నాని, శర్వానంద్ లను ఒప్పించి వాతిచేత దాగుడు మూతలు సినిమా తీయాలని చూశాడు. కాని ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదు.

దిల్ రాజు నిర్మాణంలో ఆ సినిమా తెరకెక్కుతుందని అన్నారు. కాని ఏమైందో ఏమో దిల్ రాజు హరీష్ కు హ్యాండ్ ఇచ్చాడట. మల్టీస్టారర్ కథకు వేరే నిర్మాతని చూసుకోమని చెప్పాడట. తన బ్యానర్ లో సినిమా అయితే కొత్త కథ సిద్ధం చేయమని చెప్పాడట దిల్ రాజు ఇన్నాళ్లు దాగుడు మూతలు కథ మీదే కూర్చున్న హరీష్ శంకర్ కు దిల్ రాజు పెద్ద షాక్ ఇచ్చాడని తెలుస్తుంది.