
బిగ్ బాస్ సీజన్-2 ఇప్పటివరకు చప్పగానే సాగుతుంది అన్న భావనలో ఉన్నారు ఆడియెన్స్. ఏదైనా ఎన్.టి.ఆర్ చేసినంత హుశారుగా నాని యాంకరింగ్ చేయట్లేదని తెలుస్తుంది. బిగ్ బాస్-2 మూడు వారాలు కంప్లీట్ చేసుకుంది. ముగ్గురు ఇంటి నుండి వెళ్లిపోయారు. మొదటి సీజన్ అందరు సెలబ్రిటీస్ ను సెలెక్ట్ చేసిన బిగ్ బాస్ ఈ సీజన్ లో ముగ్గురు కామన్ మెన్ ను తీసుకున్నారు.
మొదటి రెండు వారాలు కామన్ మ్యాన్ ఎలిమినేషన్ పెద్ద దుమారం రేపింది. కావాలనే బిగ్ బాస్ నుండి కామన్ మ్యాన్ ను పంపిస్తున్నారని విమర్శలు చేశారు. మూడవ వారం కూడా గణేష్ వస్తాడని ఫిక్స్ అయ్యారు. కాని కిరీటి బయటకు వచ్చాడు. నిజంగానే కిరీటికి గణేష్ కన్నా తక్కువ ఓట్లు వచ్చాయా లేక కామన్ మ్యాన్ ను బిగ్ బాస్ మోసం చేస్తుందని విమర్శలు వస్తున్నాయి కాబట్టి అతని బదులు కిరీటిని బలి చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈసారి మాత్రం బిగ్ బాస్ కామన్ మ్యాన్ ను కాపాడాడు. మరి 4వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.