నాగార్జున.. నాని.. 'దేవ'దాసు..!

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని ఇద్దరు కలిసి చేస్తున్న మల్టీస్టారర్ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. యువ దర్శకుడు శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. మహానటి తర్వాత అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ నటిస్తున్నారని తెలుస్తుంది.

సినిమాలో డాన్ గా కనిపించనున్న నాగార్జునతో పాటుగా నాని డాక్టర్ గా నటిస్తున్నాడట. అందుకే ఈ సినిమాకు టైటిల్ గా వెరైటీగా దేవదాసు అని పెట్టారు. ఏయన్నార్ సూపర్ హిట్ సినిమా టైటిల్. ఇప్పుడు నాగార్జున కోసం వాడేస్తున్నారా అయితే ఇది కూడా విరహ ప్రేమకథ అంటే కాదు ఇది పక్కా ఎంటర్టైనర్ కద అంటున్నారు. సినిమాలో నాగ్ దేవగా.. నాని దాసుగా కనిపిస్తారట. ఇద్దరు కలిసి దేవదాసుగా ఎలా మారారన్నది సినిమా కథ. మొత్తానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ మల్టీస్టారర్ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.