
టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరని చెప్పొచ్చు. మళయాల ప్రేమమ్ సినిమాతో తెరంగేట్రం చేసిన అనుపమ తెలుగులో కూడా ఆ ప్రేమమ్ సినిమాతో అందరిని అలరించింది. ఇక త్రివిక్రం అఆ, శతమానం భవతి ఇలా వరుస వెంట సినిమాలతో బిజీ అయ్యింది. ప్రస్తుతం యువ హీరోలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించుకుంటున్న అమ్మడు అనుపమ రాం చరణ్ రంగస్థలం సినిమాలో నటించాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్ మిస్ అయ్యింది.
అనుపమ ప్లేస్ లో రామలక్ష్మి పాత్రలో సమంత నటించింది. ఇక రంగస్థలంలో ఆమె పాత్ర ఎంత బాగా క్లిక్ అయ్యిందో తెలిసిందే. సినిమా చూసిన అనుపమ ఇన్నాళ్లకు ఆ సినిమాపై స్పందించింది. సినిమాలో రామలక్ష్మి పాత్రకు సమంతనే పర్ఫెక్ట్ అని తానైతే అంతలా మెప్పించే దాన్ని కాదని అన్నది అనుపమ. స్టార్ సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అనుపమ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ మల్టీస్టారర్ లో నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.