రాముడిపై కత్తి మహేష్ కామెంట్..!

రివ్యూలతో కొంత పాపులారిటీ తెచ్చుకుని.. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక పవన్ ఫ్యాన్స్ మీద వీరంగం ఆడేసిన కత్తి మహేష్ ఛాన్స్ దొరికితే ఎలాంటి విషయం మీద అయినా తన కోణంలో స్పందించడానికి వెనుకడుగు వేయడు. పవన్ రాజకీయ కార్యక్రమాల గురించి కొన్నాళ్లు హడావిడి చేసిన కత్తి మహేష్ రాముడి మీద కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కత్తి మహేష్ ఓ చర్చా వేదిక ఫోన్ ఇన్ లో రాముడి మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. రామాయణం తన దృష్టిలో ఓ కథ మాత్రమే అని చెప్పిన కత్తి మహేష్.. రాముడు ఎంత ఆదర్శవంతుడో అంత దగుల్బాజీ అని తాను నమ్ముతానని అన్నాడు. రాముడి మీద అలాంటి విమర్శ చేసినందుకు గాను హిందూ జనశక్తి నేతలు కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ లో కత్తి మహేష్ పై ఫీర్యాదు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు ఎలాంటివైనా సరే సమర్ధించుకునే కత్తి మహేష్ ఈ కేసు విషయమై ఇంకెన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి.