
మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమానో అందరికి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో 25 ఏకరాల్లో సెట్ వేశారు. ఈ సెట్ లోనే సినిమా మొత్తం షూట్ చేశారని తెలిసిందే.
ఇక ఈ సినిమా తర్వాత ఆ సెట్ లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. అంతేకాదు 25 ఎకరాల ఈ ప్లేస్ ను రాం చరణ్ సొంతం చేసుకోవాలని చూస్తున్నాడట. ఇక్కడే మెగా స్టూడియో ఒకటి కట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ ప్లేస్ ఇంకా అమ్మకానికి పెట్టలేదట. లీజ్ గానే రాం చరణ్ తీసుకున్నాడట. మరి బేరం కుదిరితే మాత్రం రంగస్థలం సెట్ కాస్త మెగా స్టూడియోగా మారే అవకాశం ఉంది.