లిప్ లాక్స్.. అయ్య బాబోయ్ అనేస్తుంది..!

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ తో కూడా హిట్ అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన మహానటి సినిమాలో అమ్మడి నటనకు అందరు ఫిదా అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో ఫుల్ ఫాం కొనసాగిస్తున్న కీర్తి ఐదారు సినిమాలు చేసినా ఒక్క సినిమాలో కూడా గ్లామర్ డోస్ పెంచలేదు. పక్కింటి అమ్మాయిగా కనిపించే కీర్తి తన నటనతోనే అందరి మనసులను గెలుచుకుంటుంది.

ఇక ఈమధ్య ఓ ఇంటర్వ్యూ లో లిప్ లాక్స్ పై తన అభిప్రాయం చెప్పింది కీర్తి సురేష్. సిగ్గు ఎక్కువ ఉన్న తనకు రొమాంటిక్ సీన్స్ అంటే అసలు నచ్చవని చెబుతుంది. ఇప్పటివరకు తనకు రొమాంటిక్ రోల్స్ రాలేదని ఒకవేళ అలాంటి పాత్రలు వచ్చినా తాను నో చెబుతానని అంటుంది. వచ్చిన కొత్తలో అందరు ఇలానే చెబుతారు కాస్త క్రేజ్ తగ్గింది అనిపిస్తే గ్లామర్ గేట్లు ఎత్తేస్తారు. త్రిష కూడా ముందు అభినయానికే ప్రిఫరెన్స్ ఇచ్చి తగిన క్రేజ్ తెచ్చుకోగా తర్వాత తర్వాత గ్లామర్ డాల్ గా మారింది. మరి కీర్తి నిజంగా అలానే ఉంటుందా లేక మారుతుందా అన్నది చూడాలి.