
ఊహించినట్టుగానే ఇన్నాళ్లు శాంతంగా సమాధానం చెప్పిన రేణు దేశాయ్ కూడా ఫైర్ అయ్యేలా చేశారు పవన్ అభిమానులు. రెండో పెళ్లి చేసుకోబోతున్న రేణు దేశాయ్ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ వ్యంగ్యాశ్త్రాలు అందరికి తెలిసిందే. కొద్దిరోజులుగా ఆమెను టార్గెట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ చేసే హంగామా రేణు దేశాయ్ కు చిరాకు తెప్పించింది. ఏకంగా ట్విట్టర్ ఖాతా మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఫ్యాన్స్ తాకిడి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ట్విట్టర్ పోయినా ఇన్ స్టాగ్రాం ఉంది కదా అని అక్కడ పవన్ ఫ్యాన్స్ గోల భరించలేకపోతుంది రేణు దేశాయ్. అందుకే ఇక మీదట ఎవరు తనని కామెంట్ చేసినా పి.ఆర్ టీం వారి ఎకౌంట్ బ్లాక్ చేస్తుందని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు పవన్ తో పెళ్లి, డివోర్స్ వ్యవహారాల అసలు వాస్తవం బయట పెడితే ఫ్యాన్స్ నోళ్లు మూసుకోవాల్సిందే అంటూ సంచలన కామెంట్ పెట్టింది.