
పిఎస్వి గరుడవేగ సినిమాతో మళ్లీ హిట్ అందుకున్న యాంగ్రీ యంగ్ మన్ డాక్టర్ రాజశేఖర్ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. గరుడవేగ తర్వాత కథలను వింటున్న రాజశేఖర్ ఫైనల్ గా ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నారు. రీసెంట్ గా అ! సినిమాతో అందరిని ఆశ్చర్యపరచిన ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో రాజశేఖర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా ఆ వెళ్లడించడం జరిగింది.
రాజశేఖర్ తో ప్రశాంత్ వర్మ కాంబినేషనే కొత్తగా అనిపిస్తున్న ఈ మూవీ కచ్చితంగా ప్రయోగాత్మకంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ క్వీన్ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది.