ఒక్క బయోపిక్.. ఇన్ని కష్టాలా..!

ఏ ముహుర్తాన నందమూరి బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదలుపెట్టాడో కాని ఆ సినిమాకు అన్ని అడ్డకులే ఎదురవుతున్నాయి. తేజ డైరక్షన్ లో మొదలైన ఈ సినిమా అతని చేతుల్లో నుండి క్రిష్ చెంతకు చేరింది. శాతకర్ణి సినిమా కోసం కలిసి పనిచేసిన క్రిష్, బాలయ్య బాబులు ఎన్.టి.ఆర్ సినిమాకు ఎంతో అద్భుతంగా తెరకెక్కించాలని భావించారు. 

క్రిష్ చేతుల్లోకి వచ్చాక ప్రాజెక్ట్ స్పీడందుకుంది. సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ సెలెక్ట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడి పాత్రలో రానా, ఏయన్నార్ కోసం సుమంత్, కృష్ణ పాత్రలో మహేష్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పాత్రలో సచిన్ కేడ్కర్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అదే సమస్యగా మారింది. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో తన తండ్రి భాస్కరరావు పాత్రని నెగటివ్ గా చూపిస్తున్నారని సినిమా యూనిట్ కు నోటీసులు పంపించారు నాదెండ్ల భాస్కరరావు పెద్ద కొడుకు.    

ఎన్.టి.ఆర్ బయోపిక్ తీయడం మంచి ఆలోచనే కాని తన తండ్రి పాత్రలో నెగటివ్ షేడ్స్ చూపిస్తున్నట్టు సమాచారం అందుకే నోటీసులు పంపించినట్టు భాస్కరరావు పెద్ద కొడుకు చెబుతున్నారు. మరి ఈ వ్యవహారం ముగిసినా ఏదో ఒక రూపంలో ఎన్.టి.ఆర్ బయోపిక్ కు కష్టాలు తప్పేలా లేవు.