కుర్రాడు నందమూరి టైటిల్స్ పై పడ్డాడే..!

యువ హీరోల్లో మంచి పాపులారిటీ సంపాదించిన నాగ శౌర్య ఈ మధ్యనే ఛలో అంటూ సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే విచిత్రం ఏంటంటే నాగ శౌర్య నందమూరి హీరోల టైటిల్స్ వాడటం విశేషం. శ్రీనివాస్ అనే నూతన దర్శకుడితో సినిమాకు నర్తనశాల టైటిల్ పెట్టిన నాగ శౌర్య.. ఆ రాజా కొలుసు డైరక్షన్ లో వస్తున్న సినిమాకు నారి నారి నడుమ మురారి అంటూ టైటిల్ పెట్టారట.

నర్తనశాల సినిమా సీనియర్ ఎన్.టి.ఆర్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమా కాగా.. నారి నారి నడుమ మురారి సినిమా బాలయ్య బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. మరి ఈ హీరో నందమూరి టైటిల్స్ పెట్టడంపై అసలు కారణం ఏంటన్నది తెలియదు కాని నందమూరి ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నాడు. మరి ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.