'ఉద్యమ సింహం'గా.. కె.సి.ఆర్ బయోపిక్..!

మహానటి సినిమా తర్వాత బయోపిక్ సినిమా అంటే బీభత్సమైన క్రేజ్ వచ్చింది. సావిత్రి జీవిత కథను ఎంతో అందగమా తెరకెక్కించారు. అయితే అది ఒకప్పటి ఎవరికి తెలియని కథ. అయితే అందరికి తెలిసిన జీవిత కథలను తెర మీదకు తెస్తున్నారు. అవే ఎన్.టి.ఆర్, వైఎస్సార్ బయోపిక్. ఈ రెండు సినిమాలు వేటికవే స్పెషల్ కానున్నాయి. అయితే కొన్నాళ్లుగా కె.సి.ఆర్ బయోపిక్ మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. 


ఎట్టకేలకు ఈరోజు ఆ సినిమా ముహుర్తం ఫిక్స్ అయ్యింది. కల్వకుంట్ల నాగేశ్వరరావు కథ అందిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాను పద్మనాయక ప్రొడక్షన్స్ లో సమర్పిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా ఉద్యమ సింహం అని రిజిస్టర్ చేయించారట. 


కె.సి.ఆర్ బాల్యం, రాజకీయ అరంగేట్రం, తెలంగాణా ఉద్యమంతో పాటుగా రాష్ట్ర సాధన విషయాలను ఇందులో ప్రస్థావించడం జరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా నవంబర్ 29, 2009 కె.సి.ఆర్ ఆమరణ నిరాహార దీక్షను కూడా ఇందులో చూపిస్తారట. అంతేకాదు ఆ రోజునే ఉద్యమ సింహం సినిమా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. నాజర్ కె.సి.ఆర్ గా నటిస్తుండగా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది.