
మెగా ఫ్యామిలీ నుండి కొత్త ఓ హీరో వస్తున్నాడు అతనే కళ్యాణ్ దేవ్. మెగాస్టార్ చిన్నళ్లుడు అయిన కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాకేష్ శషి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో మెగా హీరోల సైలెన్స్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
విజేత టీజర్ టైంలో మెగా హీరోలెవరు స్పందించలేదు. ఆ టైంలో వారు బిజీ అనుకున్నా మెగాస్టార్ వచ్చి మరి ఆడియో రిలీజ్ చేశాడు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఇక ఇప్పుడు సినిమా ట్రైలర్ కూడా వచ్చింది. కనీసం దీని గురించి అయినా మెగా హీరోల్లో ఏ ఒక్కరైనా స్పందిస్తారని అనుకుంటే ఎవరు కనీసం మాట వరసకి ప్రస్థావించలేదు. మరి విజేత మీద ఈ మెగా సైలెన్స్ దేనికి అన్నది ఎవరికి అర్ధం కావట్లేదు.