
బయోపిక్ లపై క్రేజ్ పెరగడంతో సెట్స్ మీద ఉన్న బయోపిక్ సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్.టి.ఆర్ బయోపిక్ గా ఎన్.టి.ఆర్ సెట్స్ మీద ఉండగా వైఎస్సార్ బయోపిక్ గా యాత్ర షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో బాలయ్య తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో 60 గెటప్పులలో బాలకృష్ణ కనిపిస్తారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో ఏయన్నార్, కృష్ణ పాత్రలు కూడా ఉన్నాయట. ఏయన్నార్ పాత్రకు నాగార్జునని అడిగారట కాని అక్కినేని కాంపౌండ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. ఇక కృష్ణ పాత్రలో మహేష్ కోసం స్వయంగా మహేష్ కు బాలకృష్ణ ఫోన్ చేశాడట. మహేష్ కనుక ఈ ప్రాజెక్టులో భాగమైతే ఆ లెక్క వేరేలా ఉంటుంది. బాలయ్య ఆఫర్ కు మహేష్ పాజిటివ్ గా స్పందించాడని తెలుస్తుంది. అయితే అఫిషియల్ గా మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఒకవేళ బాలయ్య, మహేష్ ఒకే స్క్రీన్ పై తమ తండ్రి పాత్రల్లో కనిపిస్తే నందమూరి, ఘట్టమనేని ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం.