
ఖైది నంబర్ 150తో పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా తర్వాత ఎన్నాళ్ల నుండో అనుకుంటున్న సైరా నరసింహారెడ్డి ప్రాజెక్ట్ షురూ చేశాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 40 శాతం వరకు పూర్తయిందట. ప్రస్తుతం సైరా కోసం యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. కేవలం ఈ యాక్షన్ పార్టే 40 కోట్ల దాకా ఖర్చు అవుతుందని అంటున్నారు.
ఇక ఈ షూటింగ్ కోసం రోజు మొత్తం చిరు కూడా సెట్స్ లో ఉంటున్నారట. అంతేకాదు దాదాపుగా తెల్లవారు ఝామున 3 గంటల దాకా షూటింగ్ చేస్తూనే ఉన్నారని సమాచారం. 60 ఏళ్లు దాటాక కూడా చిరంజీవి ఈ రేంజ్ లో కష్టపడటం సాధారణ విషయం కాదు. ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలన్న కోరికతో మెగాస్టార్ ఇంత కష్టపడుతున్నారు.