
త్రివిక్రం లాంటి స్టార్ డైరక్టర్ ఏంటి షకలక శంకర్ తో సినిమా చేయడం ఏంటని ఆశ్చర్యపోఅచ్చు. జబర్దస్త్ నుండి వచ్చి వెండితెర మీద కమెడియన్ గా పాపులర్ అయిన షకలక శంకర్ హీరోగా చేసిన మొదటి సినిమా శంభో శంకర. శ్రీధర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ పట్టుకుని షకలక శంకర్ మొదట త్రివిక్రం దగ్గరకు వెళ్లాడట. ఆయన డైరక్షన్ లో 2 కోట్లతో ఈ సినిమా చేయాలని అడిగాడట.
త్రివిక్రం దానికి ఒప్పుకోకపోవడంతో షకలక శంకర్ కొత్త దర్శకుడితో ఈ సినిమా చేశాడు. త్రివిక్రం అఆలో నటించిన శంకర్ అజ్ఞాతవాసిలో అవకాశం రాలేదని అన్నాడు. త్రివిక్రం డైరక్షన్ లో చేయాలన్న కోరికతోనే ఈ కథ పట్టుకు వెళ్లాడట. త్రివిక్రం చేయకున్నా కథలో దమ్ముందని నమ్మాడు కాబట్టే ఈ సినిమా చేశాడు. మరి ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.