బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్లి..?

స్వీటీ అనుష్క పెళ్లిపై వార్త అంటే ఆమె అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. నెలకోసారి ప్రభాస్ తో అనుష్క పెళ్లంటూ హడావిడి చేయడం మీడియాకు అలవాటే. మేమిద్దరం కేవలం స్నేహితులమే అంటూ ప్రభాస్, అనుష్కలు చెప్పినా ఈ వార్తలు రాయడం ఆపట్లేదు. అందుకే ఇక ఈ వార్తలకు పర్మినెంట్ ఫుల్ స్టాప్ పెట్టేలా పెళ్లికి సిద్ధమైంది అనుష్క. ఓ బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్లికి రెడీ అయ్యిందని లేటెస్ట్ టాక్.

దుబాయ్ బిజినెస్ మ్యాన్ అనుష్కతో పెళ్లికి ప్రపోజల్ పెట్టాడట. స్వీటీ కూడా అతనికి ఓకే చెప్పిందట. అయితే అఫిషియల్ గా ఈ విషయాన్ని వెళ్లడించలేదు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ ఇయర్ ఎండింగ్ లోనే అనుష్క పెళ్లి ఉంటుందని అంటున్నారు. మరి బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్లి వార్తల్లో అయినా నిజం ఉంటుందా లేదా అన్నది చూడాలి.