
స్టార్ మా ప్రెస్టిజియస్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ అనుకునంత రేంజ్ లో సక్సెస్ అవ్వలేదని చెప్పొచ్చు. నాని హోస్ట్ గా చేస్తున్న ఈ షో సోసోగానే నడుస్తుంది. కంటెస్టంట్స్ కూడా పెద్దగా పేరు ఉన్న వారు కాబట్టి వారం రోజుల్లో వారు చేసే హంగామా ఆడియెన్స్ కు కిక్ ఇవ్వట్లేదు.
మొదటి వారం సంజనా, రెండో వారం నూతన్ నాయుడు ఎలిమినేట్ అవగా కామన్ మ్యాన్ మీదే ఎలిమినేషన్ గురి ఉందని ఆడియెన్స్ భావిస్తున్నారు. ఇక ఈ వారం కూడా హౌజ్ లో అందరు గణేష్ నే నామినేట్ చేశారు. అయితే ఆట రసవత్తరంగా సాగేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్పనిసరి.
ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మొదట మేల్ కంటెస్టంట్ ను పంపిస్తున్నారట. అతనెవరో కాదు వరుణ్ సందేష్ అని తెలుస్తుంది. ఇక అతనితో పాటుగా రెండు వారాల తర్వాత ఓ హీరోయిన్ ను బిగ్ బాస్ హౌజ్ లోకి పంపిస్తారట. మొత్తానికి ఆడియెన్స్ ను మెప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.