
బాహుబలి తర్వాత రాజమౌళి ఆ సినిమాను మించేలా మెగా నందమూరి మల్టీస్టారర్ షురూ చేశాడు. రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేయబోతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. ఇందులో హీరోయిన్స్ గా ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ఛలో బ్యూటీ రష్మిక మందన ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని టాక్.
ఇక మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫైనల్ అయ్యిందట. ఇటీవలే మహానటి సినిమాతో తన సత్తా చాటిన కీర్తి సురేష్ రాజమౌళి మెప్పు పొందింది. అందుకే సినిమాలో ఆమెను తీసుకున్నారని తెలుస్తుంది. బాహుబలి తర్వాత సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ అంటూ ఎనౌన్స్ మెంట్ చేసిన రోజే సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫిక్స్ అయ్యారు మెగా, నందమూరి అభిమానులు.